పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం చేపట్టిన ఆందోళనలో కీలక పరిణామం జరిగింది. కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరవధిక నిరాహార దీక్షను సోమవారం విరమించారు. ప్రస్తుతం దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కావడానికి బయలుదేరారు.