హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ లో
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, తీవ్ర వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఎస్సార్ నగర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విచారణలో భాగంగా ఈ ఆరోపణలపై 8 రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఉదయ్‌కి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.