loader

జర్మనీలో ప్రవాస భారతీయుల శాంతియుత ర్యాలీ

భారత్‌లోని పహల్గం‌లో ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ..  మే 4న ప్రవాస భారతీయులు ‘Bharatiya Parivar BW’ పేరిట జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో శాంతియుత సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు జరగ్గా.. 300 మందికి పైగా ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభమయ్యే ముందు సభ్యులందరూ నుదిటిపై తిలకం పెట్టుకున్నారు. దానిని సాంస్కృతిక ఐక్యతకు, నివాళికి నిదర్శనానికి గుర్తుగా చెప్పుకొచ్చారు.

ఆ కులగణనకు చట్టబద్ధత లేదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ కుల సర్వేకు చట్టబద్ధత లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనగణన ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో నాంపల్లిలోని బీజేపీ  ర్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ విజయమని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

పాకిస్తాన్ హీరోకి ప్రకాశ్ రాజ్ మద్దతు, మండిపడుతున్న నెటిజన్లు

పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు. ఏ సినిమాను ఇలా నిషేదించడం కరెక్ట్ కాదు అన్నారు ప్రకాశ్ రాజ్. పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారని, రిలీజ్ చేసి ఫలితాన్ని వారికే వదిలేయాలని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను విమర్శిస్తుండగా.. కొంత […]

నాడు రక్షకభట నిలయం.. నేడు విజ్ఞాన కేంద్రం

1995లో తిర్యాణి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ పాక్షికంగా దెబ్బతిన్నది. పేల్చివేతకు గురైన తిర్యాణి పోలీస్‌స్టేషన్‌ ఇప్పుడు యువతకు విజ్ఞానాన్ని అందించే లైబ్రరీగా మారింది. ఆసిఫాబాద్‌ ఏఎస్పీ చిత్తరంజన్‌ చొరవతో పోలీస్‌స్టేషన్‌ను లైబ్రరీగామార్చారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ గిరిజన యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. గిరిజన యువతతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు.

టీ శాట్‌లో టెట్‌పై తరగతులు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పరీక్షకు సన్నద్ధమయ్యే వారికోసం ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నట్టు టీ శాట్‌ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. 50 రోజులపాటు 200 గంటలు ప్రత్యేక ప్రసారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు నలుగురు సబ్జెక్టు నిపుణులతో లైవ్‌ కార్యక్రముంటుందని, అభ్యర్థుల సందేహాలను నివృత్తిచేస్తామని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం 040-23540326/726 1800 425 4039 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అణ్వాయుధం సహా అన్నింటినీ వినియోగిస్తాం.. రష్యాలోని పాక్‌ రాయబారి

పాకిస్థాన్‌-భారత్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో రష్యాలోని పాకిస్థాన్‌ రాయబారి బహిరంగ బెదిరింపులకు దిగారు. ఒక వేళ పాక్‌పై కనుక న్యూఢిల్లీ దాడికి దిగితే అణ్వాయుధాలు సహా పూర్తి స్థాయి శక్తులను వినియోగించిఇస్లామాబాద్‌ ప్రతిఘటనకు దిగుతుందని మహమ్మద్‌ ఖలీద్‌ జమాలి హెచ్చరించారు. రష్యాకు చెందిన ఆర్‌టీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్‌లోని కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని భారత్‌ నిర్ణయించినట్టు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉన్న పాకిస్థాన్‌ ఆర్మీ అన్నింటికీ […]

విజయవాడలో కొత్తగా సైనిక్‌ స్కూల్‌

ఏపీలోని విజయవాడ సమీపంలోని కేతనకొండ ప్రాంతంలో కొత్తగా సైనిక్‌ స్కూల్‌ రాబోతున్నది. ఇందులో జూన్‌ నుంచి 5,6 తరగతులలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం సమీపంలో సైనిక్‌ స్కూళ్లు కొనసాగుతున్నాయి. వీటికి తోడుగా కేతనకొండలో సైనిక్‌స్కూల్‌ ఏర్పాటు కాబోతున్నది. దీంతో ఏపీలో మొత్తం సైనిక్‌ స్కూళ్ల సంఖ్య 4కు చేరింది.

కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చి అడ్రస్ లేకుండా పోయారు, నేను హ్యాట్రిక్ కొట్టాను

నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూపురం ప్రజలు ఆయనకు పౌర సన్మానం చేశారు. 50 ఏళ్లు హీరోగా ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అన్నేళ్లు నటించినా, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. మీ ఆశీర్వాదంతోనే ఇది సాధ్యం. కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో, పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.

మూడు డ్యాములు క్లోజ్.. నీళ్ల కోసం అల్లాడుతున్న పాకిస్థాన్..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాన్ని ఎక్కడ నొక్కాలే అక్కడే నొక్కుతుంది భారత్. ఈ చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఎండగట్టే చర్యల్లో సింధు నది తర్వాత మరో డ్యాములను క్లోజ్ చేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్‌ స్లూయిస్‌ స్పిల్‌వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ చర్యతో అవసరమైతే భారత్‌ కఠిన చర్యలు తీసుకోగలదని రుజువు అయింది.

మిస్ వరల్డ్ వేదికపై తెలంగాణ సంస్కృతి..

మిస్ వరల్డ్ పోటీని ప్రపంచ వేదికగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకునే ప్రణాళికలు రూపొందించింది. 120 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్న ఈ ఈవెంట్‌ను 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ కేవలం అందాల‌ను మాత్రమే కాకుండా, తెలంగాణ సంపదను, సంస్కృతిని, చారిత్రక ఘనతను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా మారబోతుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON