స్మితా సబర్వాల్ బదిలీ…
తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది. కొద్ది రోజుల క్రితం కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది.

