ఎపిలో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతోన్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రూ.60 లక్షల విలువైన క్రిఫ్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

