టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పీఏ వాహిద్ వివాదంలో చిక్కుకున్నారు. పీఏ వాహిద్ మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీఏ వాహిద్ వ్యవహారంపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డితో పాటుగా ఆయన భార్య కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి స్పందించారు. వాహిద్‌పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అతణ్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. సంపూర్ణంగా విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని రెడ్డెప్పగారి మాధవిరెడ్డి కూడా ట్వీట్ ద్వారా తెలియజేశారు.

