కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఛార్జీషీట్ విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్నది పాలన కాదని, అది కేవలం ప్రజా పీడన మాత్రమేనని ధ్వజమెత్తారు. గడిచిన 1000 రోజుల సమయం పూర్తిగా క్రిమినల్ వేస్ట్ అని, ఈ కాలానికి ఉన్న విలువ సున్నా అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పిన నాయకులు, ఇప్పుడు 1000 రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.