పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. దాంతో మార్కెట్లకు చమురు సెగ తగులుతోంది. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతుంటే లోహాలకు మాత్రం డిమాండ్ తగ్గుతోంది. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.55 లక్షలు పలుకుతోంది. నిన్నటికన్నా పసిడి ధర రూ.2వేలు దిగొచ్చింది. కేజీ వెండి రూ.2,37,486 నుంచి రూ.2,34,478కు పడిపోయింది. దీంతో కేజీకి రూ. మూడువేల మేర ధర తగ్గింది.