నగరంలో ఎలాంటి సరైన అర్హతలు లేకుండా నకిలీ డాక్యుమెంట్స్‌తో డాక్టర్లుగా చెలామణి అవుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో సరైన మెడికల్ అర్హతలు లేకపోయినప్పటికీ వీరు క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు సెలైన్లు, ఇంజక్షన్లు, మెడిసిన్ ఇస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన ఒక మహిళ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గత కొన్నేళ్ల నుంచి అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

