స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ధిలో NIT Warangal పరిశోధకులు చక్కెర ఆధారిత సేంద్రియ అణువులను ఉపయోగించి యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చి, ఆ విద్యుత్తు సహాయంతో నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను రూపొందించారు. ఈ ఆవిష్కరణకు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ కూడా మంజూరు చేసింది. మన చుట్టూ జరిగే చిన్నపాటి కదలికలు, కంపనలు, రాపిడి వంటి ప్రక్రియల్లో వృథా అవుతున్న యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మార్చే ‘ట్రైబోఎలక్ట్రిక్ నానోజనరేటర్’ సాంకేతికతను ఎన్ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.