ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు, ప్రజల్లో ఆసక్తిని పెంచే లక్ష్యంతో కర్ణాటకలోని మైసూరులో నూతనంగా నిర్మించిన కాస్మోస్-మైసూరు ప్లానెటేరియంను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లానిటోరియంలో 15 మీటర్ల LED డోమ్, 42.7 మిలియన్ల పిక్సెల్స్‌తో విజువల్ టెక్నాలజీని వాడారు. ఈ ప్లానిటోరియంలో 8K కంటే ఎక్కువ రిజల్యూషన్‌తో అంతరిక్షంలోని అద్భుతాలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందవచ్చు. సుమారు 42.7 మిలియన్ల పిక్సెల్స్‌తో గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, అంతరిక్ష సంఘటనలను అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి.

