కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనందన్ ను ఆదేశించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథీపై 8వ తేదీనే ఫిర్యాదు వస్తే, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. ఈ మేరకు డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.