కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని తెలంగాణలో నిరసనలు ఉధృతం అవుతున్నాయి. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బండి సంజయ్, భగీరథ్ ఫోటోలు తగలబెట్టి నిరసన తెలిపారు. బండి సంజయ్ ఖబడ్డార్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఇటీవల బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.