ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు.. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన’ కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు.ఎమ్మెల్యే దంపతులతో పాటు మరో 20కి పైగా నిరుపేద జంటలు ఒకే వేదికపై వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాయి. ఈ పెళ్లికి ఎమ్మెల్యే దీపేష్ సాహు సాంప్రదాయబద్ధంగా ఎడ్లబండిపై ఊరేగింపుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాన్యులతో కలిసి పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యేను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు.