తన తండ్రిని సాధిక్ హత్య చేశాడని బాలుడు కార్తికేయ రెడ్డి ఆరోపించాడు. ప్రొటీన్ షేక్‌లో రసాయనాలు (సైనైడ్) కలిపి తన తండ్రి జగదీష్‌రెడ్డిని సాధిక్‌ఖాన్ హతమార్చాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ విషయాల గురించి ఎవరికైనా చెబితే తనను టెర్రరిస్టులకు అమ్మేస్తానని సాధిక్ బెదిరించేవాడని, దీంతో భయపడి ఎవరికీ చెప్పుకోలేకపోయానని తెలిపాడు. సాధిక్ ఖాన్ పెట్టిన టెర్రర్, బ్లాక్‌మెయిలింగ్‌తో తన తాత ఏఈ నూకరాజు, అమ్మమ్మ మీనా, తల్లి సౌజన్యలు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపాడు.