కెనడాలో భారత సంతతికి చెందిన యువ జంట దారుణ హత్యకు గురయ్యారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో వాల్మార్ట్ స్టోర్ పార్కింగ్ స్థలంలో గుర్తుతెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 ఏళ్ల యువకుడు, అతడి 24 ఏళ్ల స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 15వ తేదీ రాత్రి సర్రేలోని 88 అవెన్యూ, 124 స్ట్రీట్ సమీపంలో ఉన్న వాల్మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.