సీఎం చంద్రబాబుతో భేటీ తరువాత కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన వివరణలు తనకు సమంజసంగా అనిపించలేదన్నారు. మంత్రి పదవి కోసమే తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాననే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తాను గతంలోనే ఆ పదవిలో ఉన్నానని.. ఇప్పుడు అవసరం లేదన్నారు. ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి పేర్కొన్నారు.బయటకు ఒకలా చెప్పి.. లోపల మరో విధంగా చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు.