ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద నవంబర్ 12 తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కాకా సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ముచ్చింతల్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పండ్ల లోడ్ లారీ ఆయన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్‌కు కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.