జమ్మూ కాశ్మీర్లోని కుర్గాం జిల్లాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన మరికొన్ని కొంగటల్లోనే ఇద్దరు పోలీస్ స్పెషల్ ఆఫీసర్లు అదృశ్యమయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కిష్త్వార్ జిల్లా, దచ్చన్ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాల నుంచి ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కనిపించకుండాపోయారని.. దీంతో భద్రతా దళాలు భారీ సంయుక్త గాలింపు చర్యలను ప్రారంభించాయని అధికారులు తెలిపారు. అదృశ్యమైన వారిని బాబీ చంద్ (57), రాశ్పాల్ కుమార్ (45)గా గుర్తించారు.

