రాప్తాడు నిందితుడు హేమంత్ రెండు రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొని మంచంపై నుంచి పడి పోయాడు. వైద్యులు సీటీ స్కాన్ చేయించగా పల్మనరీ ఎంబాలిజం బయటపడింది. దీనికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. శస్త్రచికిత్సల తర్వాత (పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్) తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం ఒకటని వైద్య నిపుణులు చెప్పారు. రక్తం చిన్నచిన్న గడ్డలుగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు అంతరాయం కలిగి, గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందన్నారు.

