
అఖిల్ అక్కినేని తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పారు. ప్రియురాలు జైనాబ్ రవ్జీతో ఆయన వివాహం శుక్రవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అతిథులు,
సినీ ప్రముఖుల సమక్షంలో అఖిల్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 8న రిసెప్షన్ జరగనుంది.