మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైకాపాకు రాజీనామా చేశారు. వైకాపా విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త పదవులకు రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. చిన్న శ్రీను ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్ గా ఉన్నారు.