టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. పార్టీ క్యాడర్ సమన్వయంతో పాటు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టడంతో పాటు వాటిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా విడదీయడం ఎవరి తరం కాదని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

