ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు ప్రాణాపాయ స్థితిలో తన ఎడమ చేతిని కోల్పోయింది. వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన రేణుకకు కవలలు జన్మించగా, ఒక శిశువు బరువు తక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు, నర్సులు క్యాన్యులా సరిగ్గా అమర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు చేతికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. నొప్పి భరించలేక పసికందు ఏడుస్తున్నా, డాక్టర్లు పట్టించుకోకుండా ఆయింట్మెంట్ రాసి చేతులు దులుపుకున్నారు. చివరకు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో పసికందు చేయి తొలగించాల్సి వచ్చింది.

