ముఖ్యమంత్రి విజయ్ టీవీకే ప్రభుత్వ మంత్రి ఆధవ్ అర్జున.. విడాకులు తీసుకున్నారు. విజయ్ కేబినెట్ లో పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారాయన. తన భార్య డైసీ మార్టిన్ తో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 14 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన వీరి వైవాహిక బంధానికి తెరపడినట్టయింది. ఆయన అత్తగారు లీమా రోజ్ మార్టిన్.. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు. అర్జున బావమరిది పుదుచ్చేరి కామరాజ్ నగర్ ఎమ్మెల్యే చార్లెస్ మార్టిన్ ఆయనపై బహిరంగ ఆరోపణలు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది.