ముంబయిలోని అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ బయట కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పథకం రచించినట్లు దిల్లీ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కుట్రను అమలు చేసేందుకు సిద్ధమైన ఇద్దరు అనుమానిత షూటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నవంబర్ 15 అర్ధరాత్రి అమితాబ్ బచ్చన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ‘బతికి బయటపడ్డాం’ అంటూ కేవలం రెండు పదాలతో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.