ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం ప్రధాని మోదీ పొదుపు చర్యలలో ఇప్పటికే ప్రభుత్వఆఫీసులకు వారంకు రెండు రోజులు వర్క్ ఫ్రమ్, కార్ పూలింగ్ పాటించాలని సూచించింది. ఇక తాజాగా ఢిల్లీ సర్కారు.. ప్రైవేటు కంపెనీలకు సైతం వారంలో రెండు రోజులు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, కార్ పూలింగ్ పై ప్రచారం నిర్వహించి పాటించేలా చూడాలని కోరింది. రిమోట్ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఐటీ కంపెనీలు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం టెకీ కంపెనీలకు పలు సూచనలు చేసింది.