కేరళలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్, మరో 20 మంది క్యాబినెట్ మంత్రులు మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఆదివారంనాడు లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. సతీశన్ మంత్రివర్గంలో రమేష్ చెన్నితాల, కె.మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జెసెఫ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు చోటు దక్కింది.