కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, బాధితురాలైన మైనర్ బాలికను తప్పుబడుతూ కంటెంట్ క్రియేట్ చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు అధికారికంగా కేసులు నమోదు చేశారు. చట్టప్రకారం మైనర్ల హక్కులను ఉల్లంఘించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ చర్య ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.