దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల సమీపంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో సునామీ ముప్పుపై ఆందోళన నెలకొంది. వనాటు దీవుల్లోని సోలా ప్రాంతానికి పశ్చిమంగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. సముద్ర గర్భంలో భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే, భూకంపం వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టంపై అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.