వందేమాతరం బిల్లు ఆమోదంపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘వందే మాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన హోదా కల్పించే ప్రయత్నం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారని ANI తెలిపింది. ‘జనగణమన’ దేశ ప్రజలను, దేశ సమగ్రతను ప్రతిబింబిస్తే, ‘వందే మాతరం’లో దేవతారాధన అంశం ఉందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల భావజాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.