ఇటీవల లోక్ సభలో పరీక్షల సంస్కరణల కమిటీపై మాట్లాడుతున్నప్పుడు.. మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటిని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ‘గోమూత్ర నిపుణుడు’ అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈక్రమంలో 215 మంది విద్యావేత్తలు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆమె వ్యాఖ్యలపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరి అభిప్రాయాల్లోని సారాంశాన్ని గుర్తించకుండా.. కేవలం ఒక ముద్ర వేసి కొట్టిపారేయడం సరికాదని పేర్కొన్నారు. ఇది శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు.