జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్ స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక వివాహిత మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని లైంగికంగా వేధించడం, బెదిరింపులకు గురిచేయడం, డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్
కమిషనర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా ఇలాంటి ఆరోపణలు
వచ్చినప్పుడు అధికారులను ప్రాథమికంగా
వేకెన్సీ రిజర్వ్ (VR)కు పంపడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈ కేసులోని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని శ్రీనివాసులు రెడ్డిని నేరుగా సస్పెండ్ చేశారు

