పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సోషల్ మీడియాలో ఇటీవల పెరుగుతున్న అనవసర వివాదాలు, నెగెటివిటీపై పరోక్షంగా స్పందించారు. నెట్టింట్లో సాగే వ్యర్థమైన ప్రచారాలను, ట్రోలింగ్స్‌ను అస్సలు పట్టించుకోవద్దని అభిమానులకు హితవు పలికారు. అనవసరమైన విషయాలపై ఎనర్జీని, సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తూ, ఆ శక్తిని సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు, సొంత ఎదుగుదలకు వినియోగించాలని పిలుపునిచ్చారు.