హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్ పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, నాచారం, కాప్రా తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాదాపూర్ లోని ఐకియా – హైటెక్ సిటీ మార్గంలో పరిస్థితి ఇదీ.