బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ దేశంలో అడుగు పెట్టిన వెంటనే అరెస్టు చేస్తామని అక్కడి న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ తెలిపారు. మరణశిక్ష పడిన ఆమెకు నేరుగా కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా దక్కకపోవచ్చని చెప్పారు. ఆలోపే ఆమెను అరెస్టు చేస్తారన్నారు. చట్టం కల్పించిన అధికారాన్ని తాము వినియోగిస్తామని పేర్కొన్నారు. “హసీనాకు తిరిగి వచ్చే హక్కు ఉంది. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టాన్ని ఉల్లంఘించేలా మేం ఏమీ చేయబోము” అని పేర్కొన్నారు.