క్రొయేషియా వేదికగా జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్లో ఆర్.ప్రజ్ఞానంద అదరగొడుతున్నాడు. ర్యాపిడ్ చెస్ అంటే చాలు చెలరేగిపోయే ప్రజ్ఞానంద చివరిరోజు తనకు తిరుగులేదని చాటుతూ మూడు మ్యాచుల్లో విజయం సాధించాడు. చివరి రోజు ఇవాన్ సరిక్(క్రొయేషియా), డీక్ బొగ్డన్(రొయేనియా), నెదర్లాండ్ గ్రాండ్‌మాస్టర్ అనిశ్ గిరిను ఓడించి 12 పాయింట్లు కొల్లగొట్టాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అయితే.. వరల్డ్ ఛాంపియన్ డి.గుకేశ్ అనూహ్యంగా మూడు ఓటములతో ఐదో స్థానంలో నిలిచాడు.