ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పులవల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన సేవలను ప్రభుత్వానికి చెందిన ‘ఉమంగ్’ (UMANG) యాప్‌కు బదిలీ చేసింది.