అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ (Semiquincentennial) వేడుకల సందర్భంగా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రసంగం చేశారు. సౌత్ డకోటాలోని చారిత్రాత్మక మౌంట్ రష్మోర్ (Mount Rushmore) వేదికగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా గొప్పతనాన్ని కొనియాడటంతో పాటు దేశంలో కమ్యూనిజం ముప్పు పెరుగుతోందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.