తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలోని కన్నిగైపెట్టై గ్రామంలో రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయ్యింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి ఊపిరాడక కుప్పకూలిపోయారు.వీరిలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారంతా మహిళలే అని తెలుస్తోంది. అలాగే 70 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 11 మంది వెంటిలేటర్లపై ఉన్నారని మరికొందరు ఇంట్యుబేషన్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.