రైతు డిస్కం ఏర్పాటు వెనుక మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు రహస్యంగా ఉంచి నిన్న చిట్ చాట్ లో ముఖ్యమంత్రి మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రైతు డిస్కం ఏర్పాటు విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని, వినియోగదారులైన రైతుల అభిప్రాయాలను సేకరించాలని డిమాండ్ చేశారు.

