ఆసియా క్రీడల్లో భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ తజకిస్థాన్ కు చెందిన అబ్దుల్ మజీదు 10-9 తేడాతో ఓడించాడు. మరోవైపు పురుషుల బాక్సింగ్ 80 కిలోల విభాగంలో అంకుశ్ పంఘాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్సియాంగ్ను 4-0 తేడాతో ఓడించాడు. దీంతో ఆసియా గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో 15 స్వర్ణాలు చేరాయి. మొత్తం పతకాల సంఖ్య 75కి చేరింది.