రెండో దశలో నిర్వహిస్తున్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు రోజుల్లో మొత్తం 7 వేల 508 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు 385, డివిజన్లు, వార్డులకు 7 వేల 123 నామినేషన్లు వేశారు. చివరి రోజైన సోమవారం నగరపాలక సంస్థల్లో మేయర్, డివిజన్ స్థానాలకు 1984, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్, వార్డులకు 3,746 నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడలో భారీగా నామినేషన్లు దాఖలు కాగా, మరోవైపు నరసరావుపేటలో నామినేషన్ పత్రాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.

