పశ్చిమ బెంగాల్లోని హల్దియా ఆయిల్
రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలోని నాప్తా రవాణా చేసే ప్రధాన పైపైన్లో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైప్ లైన్ నుంచి మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే.. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. దీంతో పలువురు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు.