ఆంధ్రప్రదేశ్లోని రాప్తాడులో ఉన్మాది దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాలిక వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. బాధితురాలి కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా, మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 32 లక్షలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, తక్షణమే ఈ నిధులను విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.