రంగారెడ్డి జిల్లాలోని బొంగులూరు శ్రీ చైతన్య కళాశాల క్యాంపస్ లో సెలవు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్. కార్తీక్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో సెలవు కోరాడు. అయితే ప్రిన్సిపాల్ అందుకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి, తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని,నిరసన వ్యక్తం చేశారు.

