అసెంబ్లీకి వెళ్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని రక్తాలు వచ్చేలా కొట్టారని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డి కాలికి గాయమైందని, కేటీఆర్ కూడా స్వల్పంగా గాయపడ్డారని వివరించారు. మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చీర లాగారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకుని పార్లమెంటుకు వెళితే తప్పు లేదు కాదు కానీ, తాము అసెంబ్లీకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తామనే బయటనే అడ్డుకున్నారని విమర్శించారు.