బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా రానున్న రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలో వేడి, ఉక్కపోతతో పాటు ఉరుములు, మెరుపులు ఉండొచ్చని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 11, 12 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొందిరాయలసీమలో వారం రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది