ఇండోనేషియాలోని హల్మాహెరా ఐలాండ్‌లో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం ఇవాళ ఉదయం విస్ఫోటనం చెందింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:41 గంటలకు ఈ విస్ఫోటనం సంభవించింది. ఇది సుమారు 10 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిదను ఆకాశంలోకి చిమ్మినట్లు ఇండోనేషియా వోల్కనోలాజికల్ సర్వే తెలిపింది.ఈ ఘటనతో పర్వతారోహణకు వెళ్లిన 20మంది గల్లంతయ్యారు. వారిలో సింగపూర్‌కు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించినట్లు సమాచారం