అమీర్ పేట్ అగ్ని ప్రమాదంలో ఏ1043 నంబర్ మెట్రో పిల్లర్ కు అగ్ని సెగలు అంటుకున్నాయి. జేఎన్టీయూ నిపుణుల బృందం రంగంలోకి దిగి ప్రత్యేక డివైజ్లతో పిల్లర్ నాణ్యత, సామర్థ్య పరీక్షలను నిర్వహించింది. దీంతో మెట్రో పిల్లర్ కు పగుళ్లు వచ్చాయంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కేవలం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మెట్రో పిల్లరు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రకటన బోర్డు కాలి దాని లిక్విడ్ పిల్లరైపై పడిందని చెప్పారు.